కోమా నుంచి మృత్యువు ఒడిలోకి హ్యూస్

November 27, 2014 | 12:12 PM | 42 Views
ప్రింట్ కామెంట్

ఆసీస్ టాప్ ఆర్డర్ ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మరణం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. రెండు రోజుల క్రితం దేశవాళీ టోర్నీ ఆడుతూ గాయపడి కోమాలో ఉన్న హ్యూస్ మృత్యువుతో పోరాడి గురువారం తుదిశ్వాస విడిచాడు. మరో మూడు రోజుల్లో(నవంబర్ 30) హ్యూస్ పుట్టినరోజు ఉండగా ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. భారత్ తో బ్రిస్బేన్ లో జరిగే తొలిటెస్టులో ఆడటానికి దాదాపు మార్గం సుగుమం చేసుకున్న వేళ హ్యూస్ ఇకలేడన్న చేదు వార్త క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు ఆడిన హ్యూగ్స్ తన మొదటి టెస్టులోని రెండో ఇన్నింగ్స్ లోనే 72 పరుగులు చేశాడు. ఆ తరువాతి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అతని బెస్ట్ స్కోరు 160 కాగా, వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 138. అతడి మరణానికి యావత్ క్రికెట్ ప్రపంచం నివాళులర్పిస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ