పాత మోడల్ హెల్మెట్ ధరించడం వల్లే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ తీవ్రంగా గాయపడ్డాడని సమాచారం. యూకే కు చెందిన ప్రముఖ హెల్మెట్ తయారీదారి సంస్థ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. షెఫిల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా హ్యూస్ ధరించిన హెల్మెట్ లేటెస్ట్ మోడల్ ది కాదని ఆయన చెప్పారు. ఇది గత ఏడాది విడుదలైన మోడల్ అని, లేటెస్ట్ మోడల్ లో తలకు పూర్తి రక్షణ ఇచ్చేలా డిజైన్ చేసినట్లు మనూర్ చెప్పారు. కాగా తలకు శస్త్ర చికిత్స జరిగినప్పటికీ హ్యూస్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. అతడు ప్రస్తుతం కృత్రిమ కోమాలో ఉన్నట్లు తెలిపారు.