మనకేందుకు బాసూ ఈ గొడవలు

December 24, 2014 | 12:49 PM | 33 Views
ప్రింట్ కామెంట్

ఇక్కడ సీన్ చూస్తే మీకేమనిపిస్తోంది. స్నేహితులతో మనం భుజంపై చేయి వేసి ఎలా మాట్లాడుతామో... అలానే కదా. ఖచ్చితంగా ఇది ఆశ్చర్యమే. క్రూగర్ జాతీయ పార్కులో ఇటీవల ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. జింక కనబడితే చాలు వెంటాడి వెంటాడి చంపే చిరుతపులి, ఇక్కడ మాత్రం స్నేహ హస్తాన్ని అందించిందంటే కాస్తా నమ్మలేకున్నాం కదా. ఈ సీన్ చూసేదాకా దక్షిణాఫ్రికాకు చెందిన ఎస్టియాన్ కూడా అలాగే అనుకున్నాడు. ఇటీవల క్రూగర్ పార్క్ సందర్శనకు వెళ్లిన ఎస్టియాన్ ఈ పిల్ల జింక, పిల్ల చిరుత ఒకదానితో ఒకటి ఆడుకోవడాన్ని ఇతడు క్లిక్‌మనిపించాడు. తాను గతంలో ఎన్నడూ ఇలాంటిది చూడలేదని.. ఇకముందు కూడా చూస్తానని అనుకోవడం లేదని అన్నాడు. దాదాపు గంటపాటు ఈ స్నేహం కొనసాగిందట. తర్వాత చిరుత ఓ పొద వెనక్కు వెళ్లగా... జింక దానిని అనుసరించిందని చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో తనకు తెలియదని, పర్యాటకులతోపాటు తానూ అక్కడి నుంచి వచ్చేశానని బెబుతూ... కాస్తా టెన్షన్ ను క్రియేట్ చేశాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ