రెండు వేల మందిని పిట్టల్లా కాల్చేశారు...

January 09, 2015 | 05:18 PM | 26 Views
ప్రింట్ కామెంట్

ఉగ్ర రాక్షసులు నైజీరియా దేశంలో కనీవినీ ఎరుగుని మారణహోమం సృష్టించారు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలో బోకోహరామ్‌ తీవ్రవాద సంస్థ... ఓ పట్టణానికి పట్టణాన్నే శ్మశానంగా మార్చివేసింది. దాదాపు 2000 మందిని ఊచకోత కోసింది. మొత్తం పట్టణాన్ని నామరూపాల్లేకుండా తగలబెట్టేసింది. పట్టణ వీధుల్లో ప్రజల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా బోకోహరామ్ ఆరేళ్లుగా అరాచకాలు సృష్టిస్తోంది. గత ఏడాది నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని అనేక గ్రామాలు, పట్టణాలను బోకో హరామ్‌ హస్తగతం చేసుకుంది. అప్పుడు జరిగిన పోరాటంలో దాదాపు 15 లక్షల మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. బాగా పట్టణంలో దాదాపు పది వేల మంది జనాభా ఉన్నారని, ఇప్పుడు మొత్తంగా ఆ పట్టణమే కనిపించకుండా పోయిందని అక్కడి నుంచి వలస వెళ్లిపోతున్న ప్రజలు తనకు చెప్పినట్లు ప్రభుత్వ అధికారి బుకర్‌ తెలిపారు. మృతులకు కనీసం అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించలేని స్థితిలో తాము ఉన్నామన్నారు. ఉగ్రవాదులు శనివారమే దాడులు ప్రారంభించాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ