అభినందించాల్సింది పోయి పాపం శిక్షించారు

February 02, 2015 | 10:34 AM | 36 Views
ప్రింట్ కామెంట్

ఎవరైనా మంచి పని చేస్తే అభినందించాలి లేదా సైలెంట్ గా ఉండాలి అంతేగానీ హేయమైన రీతిలో వ్యవహరిస్తే మాత్రం ఎలాంటి వారికైనా మండుతుంది. కాన్సర్ బాధితుల సహాయార్థం నార్త్ సోమర్ సెట్ ప్రాంతానికి చెందిన స్టాన్లాక్ (14) అనే బాలుడు విరాళాలు సేకరించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఏకంగా గుండు చేయించుకొని మరీ విరాళాలు సేకరించటం మొదలుపెట్టాడు. అయితే ఈ చర్యను అభినందించాల్సిందిపోయి అతను చదువుకునే స్కూల్ యాజమాన్యం శిక్షించింది. అది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ అతన్ని మూడు రోజులపాటు గదిలో బంధించింది. అంతేకాదు జుట్టు పెరిగే వరకు అతన్ని మిగతా విద్యార్థులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. దీనిపై విద్యార్థి తల్లి నిరసన తెలిపింది. తన కుమారుడి సేవా గుణం పట్ల గర్విస్తున్నట్లు చెప్పింది. కాగా, బాలుడు ఇప్పటి వరకు రూ.30 వేలకు సేకరించి మాక్ మిలన్ అనే స్వచ్ఛంద సంస్థకు అందించాడు. తనకు అవమానం జరిగినా సరే చేసే పనిని మాత్రం ఆపే ప్రసక్తే లేదంటున్నాడు లాక్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ