అదేంటీ పెళ్లి ప్రపోజల్ తో ప్రాణాలు పోగొట్టుకోవటం ఎంటనుకుంటున్నారా. ప్రేమించుకున్నాక పెళ్లి ప్రపోజల్ మాములే. అయితే అది అవ్వటం కాకపోవటం వేరే విషయమనుకోండీ. బల్గేరియాకు చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నాక పెళ్లి ప్రపోజల్ చేశాడు. కానీ, అది కాస్త విషాందంతం అయ్యింది. వివరాల్లోకి వెళ్లితే... సదరు యువకుడు దిమిత్రినా దిమిత్రోవా అనే యువతిని ప్రేమించాడు. కొంతకాలం బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక పెళ్లాడాలని మనోడు నిర్ణయించుకున్నాడు. ఓ రోజు తన మనసులో మాటను దిమిత్రోవాకు చెప్పాలని భావించి, ఆమెను ఓ కోండపైకి తీసుకెళ్లాడు. అక్కడ అసలు విషయం చెప్పేశాడు. ఇక ఆనందంతో ఆమె ఎగిరి గంతేసింది. అంతే... వారున్నది కొండ అంచు మీద కావటంతో దిమిత్రోవా అదుపుతప్పి కిందకి పడిపోయింది. దీంతో, తీవ్ర గాయాలయి ఆమె చనిపోయింది. ఆమె ఆనందమే ఆమె ప్రాణాలను తీసుకెళ్లింది. వారి కథ విషాదాంతం అయ్యింది. కాబట్టి ప్రపోజ్ చేసేప్పుడు చుట్టూ జాగ్రత్తగా చూసుకొండిరా అబ్బాయిలు.