పారిస్ లోని చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడిచేసిన ఉగ్రవాదులను ఇస్లామిక్ స్టేట్ రేడియో హీరోలుగా పేర్కొంది. ‘‘ఫ్రెంచ్ మ్యాగ్ జైన్ లో పని చేస్తున్న 12 మంది జర్నలిస్టులను జిహాదిస్ట్ హీరోలు చంపారు. పదిమందికి పైగా ఇతరులు గాయపడ్డారు’’ అంటూ అల్ బయన్ రేడియో ప్రశంసల్లో ముంచెత్తడం విశేషం. ఇప్పటికే పలుచోట్ల కాల్పులతో పారిస్ భయాందోళనలో ఉండగా, పలువురు ఈ ఉగ్రదాడులను ఖండిస్తున్నారు. మరోవైపు ఈ దాడిలో చనిపోయిన వారికి నివాళిగా పారిస్ ఈఫిల్ టవర్ సందర్శనాన్ని నిలిపివేశారు.