ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ ‘వాట్సప్’ వినియోగదారుల సంఖ్య 70 కోట్లకు చేరింది! వాట్సప్‌ను ఫేస్‌బుక్ సంస్థ గత ఏడాది ఆగస్టులో విలీనం చేసుకునే నాటికి ఈ సంఖ్య 60 కోట్లు. విలీనం తర్వాత వాట్సప్ ప్రభ తగ్గుతుందని చాలామంది భావించినా ఆ అంచనాలకు తారుమారు చేసింది. ఆశ్చర్యకర రీతిలో కేవలం 4 నెలల్లోనే 10 కోట్ల మంది అదనంగా ఇందులో చేరడం విశేషం. ప్రస్తుతం రోజుకు సగటున 3 వేల కోట్ల మెసేజ్‌లు పంపుతున్నట్టు వాట్సప్ సీఈవో జాన్ కౌమ్ తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ నెట్‌వర్క్స్‌లో ఒకటిగా వాట్సప్ అవతరించింది.