చిన్నారుల బతుకుని చిన్నాభిన్నం చేశారు

December 06, 2014 | 04:31 PM | 45 Views
ప్రింట్ కామెంట్

తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు హెచ్ఐవీ రక్తం ఎక్కించారు పాకిస్తాన్ డాక్టర్లు. ఈ రక్తం ఇచ్చిన వారికి హెచ్ఐవీ ఉండగా, డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఎటువంటి పరీక్షలు చేయకుండా 10 మంది చిన్న పిల్లలకు రక్తం ఎక్కించారు. దీంతో వారందరికీ హెచ్ఐవీ సోకింది. పాకిస్థాన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. 5 నుంచి 16 ఏళ్ల మధ్య వయసుగల తలసీమియా బాధితులు పదిమందికి హెచ్ఐవీ సోకినట్లు పాకిస్థాన్ తలసీమియా ఫౌండేషన్ సెక్రెటరీ జనరల్ డాక్టర్ యాస్మిన్ రషీద్ నిర్ధారించారు. తలసీమియా వ్యాధి పీడితులకు తరచుగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పుడో హెచ్ఐవీ సోకిన వ్యక్తుల రక్తాన్ని వీరికి ఎక్కించడం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ అంశంపై పూర్తి విచారణ జరపాలని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ కమిటీని వేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ