చైనా జోక్యం అవసరమా?

December 06, 2014 | 04:05 PM | 48 Views
ప్రింట్ కామెంట్

భారత్ కు సంబంధించి ఏ అంశంలోనైనా తమకు అవసరం లేకపోయినప్పటికీ జోక్యం చేసుకోవటం చైనాకు మొదటి నుంచి అలవాటైన పనే. జనాభాలోనే కాదు అభివృద్ధిలో కూడా తమకు పోటీ వస్తుందనే ఉద్దేశ్యంతో భారత్ ఇమేజ్ ను నాశనం చేయాలని చైనా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. పైకి భారత్ తో సత్సంబంధాలు కొరుకుంటున్నాం అని ప్రకటిస్తునే లోపాయికారిగా పాకిస్థాన్ లాంటి ఉగ్ర ప్రేరేపిత సంస్థతో ఒప్పందం చేసుకుంది. అందుకే పాక్ భారత్ మధ్య ఏ చిన్న తగాదా వచ్చిన సరే మధ్యలో దూరి పోతుటుంది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్థాన్ కే చెందుతుందంటూ మరో ప్రకటన చేసి చైనా ప్రభుత్వం మరో మారు భారత్ ఆగ్రహనికి గురికావాల్సి వచ్చింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ప్రకటనను ప్రభుత్వ అధికార పత్రిక క్సిన్ హువా ‘గిల్ గిట్ బాల్టిస్థాన్’ పేరిట వ్యాసం ప్రచురించింది. అసలు విషయం ఏంటంటే చైనా ఈ ప్రాంతం గుండా రోడ్డును నిర్మించాలనుకుంది. దీనికి భారత్ వ్యతిరేకత తెలపటంతో ఇప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంది. అయితే చైనాకు ఇదేం కొత్త కాదు. నాలుగేళ్ల క్రితం భారత్-పాక్ విషయంలో ఇలాంటి జోక్యాన్ని చేసుకుని దీనిపై ప్రపంచ దేశాల నుంచి విమర్శలు రావటంతో క్షమాపణలు కొరింది. పైకి అగ్రరాజ్యంగా చెలామణి అవుతూ భారత్ పై ఉన్న వ్యతిరేకతను ఇలా పాకిస్థాన్ కు మద్ధతు తెలపటాన్ని మిగతా దేశాలు గమనిస్తున్నాయన్న విషయాన్ని చైనా గుర్తుంచుకోవాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ