తల్లి మొబైల్ గేమ్ సరదాతో చిన్నారి బలి

February 03, 2016 | 02:23 PM | 2 Views
ప్రింట్ కామెంట్
china mother mobile game kills her child in an accident

సెల్ ఫోన్లు మనిషి జీవితాలను, వాళ్ల పనులను ఏంతలా సులభంతరం చేశాయో... అంతలా నాశనం చేశాయి. కత్తికి రెండు వైపుల పదునున్నట్టు మొబైల్ వల్ల లాభాలతో పాటు నష్టాలున్నాయి. ఒక్క ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచాన్ని చుట్టేయటం అన్నది ఎంత నిజమో, .పక్క నున్న బంధాలను మరిచిపోతున్నామన్నది కూడా అంతే నిజం. ఎందుకంటే దూరంగా ఉన్నవారిని దగ్గర చేసేది మొబైల్ ఫోన్ అయితే దగ్గరగా ఉన్నవాళ్లని దూరం చేసేది అదే కూడా. సరిగ్గా ఇలాంటి సంఘటనే చైనాలో జరిగింది.  మొబైల్‌ మోజులో పడి ఆ తల్లి కన్న కొడుకును పొగొట్టుకుంది.

                       చైనాలో గాంగ్జౌ ప్రావిన్స్‌లో రెండేళ్ల కొడుకుతో షాపింగ్ కెళ్లిన లిన్‌.... షాపింగ్‌ పూర్తయిన తర్వాత షాపింగ్‌ మాల్‌ బయట తన కొడుకును పక్కన కూర్చోబెట్టుకుని గేమ్ ఆడుతూ కూర్చుంది.  ఈ లోపు ఆ చిన్నారి అక్కడ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై ఆడుకోవటం మొదలుపెట్టాడు.  ఆడుతూ ఆడుతూ  హ్యుందాయ్‌ కారు కింద పడి చనిపోయాడు. ఇంత జరిగా చుట్టు పక్కల వాళ్లు వచ్చి చెబితేనే ఆమెకు తెలియరాలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ