బ్యాన్ చేసినా బూతు సైట్లు చూడటంలో వారే తోపులు

May 29, 2015 | 05:18 PM | 4 Views
ప్రింట్ కామెంట్
chinese_top_in_pornsites_addiction_in_office_niharonline

అన్నిరంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న చైనీయులు మరో విషయంలోనూ అగ్రస్థానంలో నిలిచారు. మెక్సికో, బ్రిటన్ లాంటి ఉత్తరాది దేశాల కంటే ఓ విషయంలో చైనానే టాప్ గా నిలిచింది. ఆఫీసులో పోర్న్ సైట్లు చూడటంలో చైనా వారిదే అగ్రస్థానం అని ఓ సర్వే తెలిపింది. బ్లూ కోట్ సిస్టమ్స్ అనే ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఆసక్తికరమైన అని ఎందుకు అన్నామంటే అక్కడ గత కొన్నేళ్ల క్రితమే పోర్న్ సైట్లను ప్రభుత్వం నిషేధించింది. అయినా ఆఫీసుల్లో పనిచేసే వారు వారి వారి టెక్నాలజీలను వాడుకుని ఎంచక్కా చూస్తున్నారట. ఆఫీసుల్లో అశ్లీల సైట్లు చూడటం ప్రమాదకరమని తెలిసినా కూడా వారు చూడటం ఆపట్లేదట. సైబర్ సమస్యలు తలెత్తినా సరే తగ్గమని చెబుతున్నారట. మాల్వేర్ వైరస్ లను బూతు సైట్ల ద్వారా సులువుగా ఇంటర్నెట్ లో చొప్పించటం సులువైనా పని. టెక్నాలజీని విపరీతంగా వాడుకునే చైనీయులకు ఇది తెలుసు. పైగా నిషేధం కూడా అమలు ఉంది. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా కామ కోరికలు ముందు అవ్వేంత అనుకుంటున్నారేమో చైనీయులు ఇలా కక్కుర్తి పడుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ