కరువు కష్టాలు: లీటర్ నీటితో స్నానం కానిచ్చేస్తున్నారు

February 03, 2015 | 11:40 AM | 38 Views
ప్రింట్ కామెంట్

ప్రపంచంలోని పెద్ద నది అమెజాన్ ఆ దేశం గుండానే పోతుంది. అయినప్పటికీ ఆ దేశం తీవ్ర కరువులో కొట్టుమిట్టాడుతోంది. ఎంతలా అంటే స్నానం చేయడానికి కేవలం లీటర్ నీటిని మాత్రమే వాడేంతగా. బ్రెజిల్ లో ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అక్కడి రిజర్వాయర్లు ఖాళీ అయ్యాయి. నదులు పూర్తిగా ఎండిపోయాయి. ప్రజలు తాగునీటి దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చరిత్రలో కనివిని ఎరుగని కరువు ఇప్పుడు బ్రెజిల్ ను పట్టి పీడిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు, అత్యల్ఫ వర్షపాతం నెలకొనటంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు చెబుతున్నారు. జలవనరులు లేకపోవటంతో విద్యుత్ సమస్యల నెలకొందని, తద్వారా వ్యవసాయ రంగంలో సంక్షోభం నెలకొందని వారు చెబుతున్నారు. వాళ్లు గనుక మన హైదరాబాద్ వాటర్ టాంకర్ లు రోడ్డు మీద వ్రుథాగా పోనిచ్చే నీటిని చూస్తే గుండెలు బాదుకుంటారేమో.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ