పాపం... మార్పులకు చేపలు కూడా పారిపోతున్నాయట

June 08, 2015 | 04:10 PM | 0 Views
ప్రింట్ కామెంట్
fishes_flow_to_poles_niharonline

వాతావరణంలో వస్తున్న పెను మార్పులు భూమిపైనున్న మనుషులనే కాదు. నీటిలో చేపలను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవికాలంలో ఎండ వేడికి నీట్లో ఉండే చేపలు కూడా తాళలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీంతో దృవాల వైపునకు చేపలు తరలిపోతున్నాయట. నీరు వేడేక్కేకొద్దీ, నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందని తద్వారా చేపల జీవక్రియలు పెరుగుతాయని, అధిక ఆక్సిజన్ అవసరమవుతుందని వారు వెల్లడించారు. సరిపడా ఆక్సిజన్ లభించకపోవటంతో చేపలు ధృవ ప్రాంతాలకు తరలిపోతున్నాయని పరిశోధనల్లో వెల్లడైనట్లు వారు తెలిపారు. ఈ శతాబ్దం చివరికల్లా వాతావరణ సమతౌల్యం దెబ్బతినటంతో ఉష్ణోగ్రతలు పెరిగి ఆక్సిజన్ శాతం తగ్గి చేపలు ధృవాలవైపునకు మరలుతాయని అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ