ఫోన్ ఎత్తలేదని భార్య ముక్కు కొరికి మింగాడు

September 10, 2015 | 03:29 PM | 1 Views
ప్రింట్ కామెంట్
china-husband-bite-and-swallow-wife-nose-niharonline

కోపం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. విచక్షణ కోల్పోయి ఎంత దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. మనిషి మృగంగా మారి ఘోరాలు కూడా చేసిన ఘటనలు కోకొల్లలు. కానీ, చైనాలో ఓ అనితరమైన దారుణం జరిగింది. తన  ఫోన్‌ కాల్ లిప్ట్ చెయలేదన్న కోపంతో ఓ భర్త ఘోరమైన పనిచేశాడు. వివరాల్లోకెళ్తే.. చైనాలోని డెజో నగరానికి చెందిన ఓ భర్త తన భార్యకు ఫోన్‌ చేశాడు. అయితే ఆమె ఫోన్‌ కాల్‌ ఎత్తలేదు. దీంతో రెచ్చిపోయిన ఆ భర్త ఆగ్రహాంతో ఇంటికొచ్చాడు. భార్యపై పడి ముక్కును కొరికాడు... ఆ ఊడివచ్చిన ముక్కును కరాకరా నమిలి మింగేశాడు. ఇక చుట్టుపక్కల వారు అక్కడికి చేరి ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ముక్కు పూర్తిగా కోల్పోయిందని, శస్త్ర చికిత్స చేశామని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అయితే తన భర్తకు ఇంతకుముందే వివాహమైందని, ఇద్దరు పిల్లలున్నారని బాధితురాలు చెప్పింది. కుటుంబ కలహాల కారణంగానే సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ