తాతకు ప్రేమతో... కింగ్ ఫిషర్!

November 24, 2015 | 03:57 PM | 1 Views
ప్రింట్ కామెంట్
greatest_grandson_capture_the_moment_a_kingfisher_dives

తమ కిష్టమైన వాళ్ల కోసం ఎంతకైనా తెగించే వారి గురించి చదివినప్పుడల్లా మనకు ఆశ్చర్యం కలగక మానదు. ఇలాంటి చర్యలను చూసినప్పుడల్లా వారి ప్రేమే ఇలాంటి పనులను చేయిస్తుందనటంలో సందేహమే లేదు. ఇక్కడో వ్యక్తి ఉదంతం ఇలాంటి దానికే ఉదాహరణ. ఆరేళ్లపాటు తెగ కష్టపడి తన తాత కోరికను నెరవేర్చాడు. అంతగా ఏం కష్టపడ్డాడనేగా మీ అనుమానం. ఓ దృశ్యాన్ని కెమేరాలో బంధించి ఫోటో తీసేందుకు స్కాట్ లాండ్ కు చెందిన అలన్ మ్యాక్ ఫద్యేన్ (46)కు ఆరేళ్ల సమయం పట్టింది. సుమారు ఆరేళ్ల పాటు 4,200 గంటలు కష్టపడి 7,900 స్నాప్స్ తీస్తే, వాటిలో తాను కోరుకున్న ఫోటో ఒక్కటి వచ్చింది. దీంతో అలన్ సంబరపడిపోయాడు. అసలేం ఫోటో అంటే కింద కథణు చదవండి.  

                             అలన్ కిర్కుడ్ బ్రైట్ సమీపంలో ఉన్న సరస్సుకు తాత రాబర్ట్ తో కలిసి ప్రతి రోజూ వెళ్లేవాడు. అక్కడి పక్షుల కిలకిలరావాలు, నీటిలోకి అమాంతం దూకి ముక్కుతో చేపను పట్టుకెళ్లే కింగ్ ఫిషర్ విన్యాసాలు చూస్తూ అమితానందం పొందేవారు. 1994లో తన తాత రాబర్ట్ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో తాతతో తన అనుబంధం నెమరువేసుకునే అలన్ తాతకు గుర్తుగా ఆయనకు ఎంతో ఇష్టమైన కింగ్ ఫిషర్ డైవింగ్ ఫోటోను అంకితమివ్వాలని భావించాడు. బుల్లెట్ వేగంతో దూసుకువచ్చి, కన్ను మూసి తెరిచేంతలో చేపను పట్టుకుని ఎగిరిపోయే కింగ్ ఫిషర్ ను కెమెరాలో బంధించడం అంత సులభం కాలేదు. చివరికి ఎలాగోలా సాధించాడు. ఈ ఫోటో తన తాతకు అంకితం అంటున్నాడు. ఈ ఫోటో తాత ఉండగా తీసి ఉంటే ఆయన చూసి ఎంతో సంతోషించేవారని అలన్ పేర్కొంటున్నాడు. ఏమైతేనేం, అనుకున్నట్టు తాతకు నచ్చిన ఫోటో తీసి అలన్ మరో మధురజ్ఞాపకం గుండెల్లో పదిలం చేసుకున్నాడీ గొప్ప మనవడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ