ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూప్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను బెదిరిస్తోంది. అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లోనే ఒబామా తల తీస్తామని హెచ్చరించింది. అమెరికాను ముస్లిం రాజ్యంగా మార్చాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. బందీగా పట్టుకున్ ఓ కుర్దు సైనికుడిని చూపిస్తూ, ఓ ఐఎస్ జిహాదీ ఈ హెచ్చరిక చేశాడు. ఇస్లాంను వ్యతిరేకించే ఎవరికైనా ఇదే గతిపడుతుంది. ఒబామా... మేం అమెరికా వస్తాం. వైట్ హౌజ్ లోనే నీ తల తెంచుతాం. అమెరికాను ముస్లిం రాజ్యంగా మార్చు అని పేర్కొన్నాడు. అంతేకాదు ఫ్రాన్స్, దాని సోదరి బెల్జియం దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నాడు. కారు బాంబులు, పేలుడు పదార్థాలతో విధ్వంసం చేస్తామని, తలలు తీస్తామని హెచ్చరించాడు. ఇక చివరగా బందీగా పట్టుకున్న సాయుధుడి పీక కోసేశారు.