ప్రేయసి తన నుంచి విడిచిపోయిందనే బాధలో ఉన్న ఓ ప్రేమికుడు ఏం చేయాలో తెలియక ఆమె మంచినికి నిప్పుపెట్టాడు. అతడో భారతీయుడని, అతని పేరు ఏఆర్ అని స్థానిక మీడియా వెల్లడించింది. జుమీరాహ్ పామ్ లోని ఓ స్టార్ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్న ఇతగాడు గతేడాది అక్టోబర్ లో ఈ చర్యకు పాల్పడ్డాడు. అతడి ప్రేయసి ఫిలిపినా కూడా అదే హోటల్ లో పనిచేస్తోంది. వారిద్దరి మధ్య బ్రేకప్ కావటంతో అతడు తట్టుకోలేకపోయాడు. దొంగతనంగా ఆమె గదిలోకి ప్రవేశించి ఆమె మంచానికి నిప్పుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె బూట్లను బుగ్గి చేశాడు. ఆమె ప్రాణానికి అపాయం కలిగించేలా వ్యవహరించినందుకు పోలీసులు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిబ్రవరి 8న కోర్టు తీర్పు వెలువరించనుంది.