రివర్స్ : స్టూడెంట్ పై లేడీ టీచర్ లైంగిక దాడి

August 27, 2015 | 03:03 PM | 5 Views
ప్రింట్ కామెంట్
lady_teacher_arrested_for_sexual_harassment_of_student_niharonline.jpg

విద్యార్ధులకు చదువును నేర్పే గురువు 'కామాం తురాణాం నా భయం నా లజ్జా' .. అన్నచందంగా కామ కోరికలు తీర్చుకోవటం మన వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తమ సుఖం కోసం ముక్కుపచ్చలారని విద్యార్థినిల జీవితాలను నాశనం చేసిన గురువులు ఎందరో. అయితే పాఠశాలల్లో విద్యార్థినులపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు, లైంగిక దాడులు చూస్తూ ఉంటాం కాబట్టి సహజం. ముఖ్యంగా నిర్భయలాంటి కఠిన చట్టాలు అమలులో ఉన్న మన దేశంలో అయితే అవి మరీను.

                            కానీ, ఈ సంఘటన దానికి కంప్లీట్ గా రివర్స్. 14 ఏళ్ల ఓ విద్యార్థిని ఓ టీచరమ్మ లోబరుచుకుని, లైంగికంగా వాడుకుందట. దాదాపు ఏడాదిన్నరగా తన కోరికలు తీర్చుకుని ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తుంది. ఆస్ట్రేలియా లోని క్వీన్స్ ల్యాండ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 27 సంవత్సరాల ఆ ఉపాధ్యాయురాలు తన విద్య చదువుకుంటున్న ఓ బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఎవరికైనా చెబితే ఫెయిల్ చేస్తానని, అవసరమైతే మనుషులతో చంపిస్తానని బెదిరించిందట. 2011 నుంచి ఈ తతంగం జరుగగా, సమగ్ర విచారణ జరిపిన కోర్టు ఆమెకు ఏడేళ్ల శిక్ష విధించింది. అయితే తాను తప్పుచేసినట్లు ఆమె అంగీకరించటంతో శిక్ష తగ్గించి ఆరున్నరేళ్లకు కుదించింది. చదువుతోపాటు అదనపు పాఠాలు బోధిస్తే ఇంతే మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ