ఆయన కూల్చేస్తే... వారసులెమో కట్టేస్తున్నారు

December 05, 2014 | 02:38 PM | 66 Views
ప్రింట్ కామెంట్

ఇస్లామిక్ ఉగ్ర సంస్థ అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ గుర్తున్నాడా? మూడేళ్ల క్రితం అమెరికా సైన్యం చేసిన దాడిలో చనిపోయాడు లేండి. కానీ, లాడెన్ కుటుంబం ఇప్పుడు వార్తల్లో కెక్కింది. ఆయన వారసులు ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన టవర్ ను నిర్మించనున్నట్లు సమాచారం. లాడెన్ కుటుంబ సభ్యులకు చెందిన నిర్మాణ సంస్థ ‘సౌదీ అల్ తుర్కీ హోల్డింగ్ గ్రూప్’ మొరాకో ఆర్థిక రాజధాని కాసాబ్లాంకాలో డౌన్ టౌన్ ప్రాంతంలో 514 మీటర్ల ఎత్తులో 114 అంతస్థుల భవనాన్ని నిర్మించనుంది. దీనికోసం ఏకంగా 1.5 బిలియన్ డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 6,100 కోట్లు) ఖర్చు చేయనుంది. ఈ టవర్ నిర్మాణం కోసం అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. గల్ఫ్, ఆఫ్రికన్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపోందించే చర్యల్లో భాగంగానే ఇలాంటి కట్టడాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. లాడెన్ అనగానే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత గుర్తోస్తుంది కదా. మరి ఆయన వారసులెమో ఇలా... ఎత్తైన బిల్డింగ్ ల మీద బిల్డింగ్ లు కట్టేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ