అరరె... సింగిల్ గా వచ్చినా సింహాం చచ్చిందే!

February 13, 2015 | 11:23 AM | 28 Views
ప్రింట్ కామెంట్
lion_fights_buffalo_niharonline

ఒకరిది ఆకలి ఆరాటం... మరోకరిది బతుకు పోరాటం. గంట సేపు భీకరంగా తలబడ్డాయి. జాంబియాలోని దక్షిణా లాంగ్వా జాతీయ పార్కులో జరిగిన ఈ ఘటన వీడియో ఇఫ్పుడు అంతర్జాలంలో హాల్ చల్ చేస్తోంది. బాగా ఆకలితో ఉన్న సింహం ఒకటి ఆ పక్కనే ఉన్న గేదెల గుంపుపై దాడి చేసింది. గేదెలన్నీ పారిపోగా పాపం ఒకటి మాత్రం దానికి చిక్కింది. అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించటం మానేసిన ఈ గేదె ఏకంగా సింహంతో పోరుకే సై అంది. ఈ పోరులో సింహం తన పంజాతో దాడిచేయగా, తానేం తక్కువ కాదంటూ గేదె తన పదునైన కొమ్ములతో విరుచుకుపడింది. ఈ పోరాటం దాదాపు గంటపాటు సాగింది. చివరకు తోక ముడిచిన సింహం తీవ్ర గాయాలతో పక్కనే ఉన్న పొదల్లోకి పరుగుతీసింది. పార్కులో సఫారీ గైడ్ గా పనిచేసే 25 ఏళ్ల ఆర్మ్ స్ట్రాంగ్ ఈ పోరాట ద్రుశ్యాలను కెమెరాలలో బంధించాడు. తన జీవితంలో ఇలాంటి సన్నివేశాన్ని ఎప్పుడు చూడలేదని అతను చెబుతున్నాడు. అయితే తీవ్రంగా గాయపడిన సింహం, తీవ్రంగా రక్తస్రావం అయిన గేదె రెండిటి ప్రాణాలు రెండు రోజుల తర్వాత గాలిలో కలిసిపోయాయట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ