ఇదేం వెర్రి రా నాయనా...! ఇల్లు వద్దు, ఆస్పత్రి ముద్దు

February 12, 2015 | 05:19 PM | 28 Views
ప్రింట్ కామెంట్
Man_hauled_out_hospital_after_overstaying_in_china_niharonline

చైనాలోని బీజింగ్ లో ఓవ్యక్తి ప్రవర్తన విడ్డూరంగా అనిపించకమానదు. మెంటావ్ గౌ గ్రామానికి చెందిన చెన్ (55) 2011 లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని సమీపంలోని జింగ్మీ ఆస్పత్రిలో చేర్చారు. నెలరోజుల తరువాత కొలుకొవటంతో అతన్ని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే చెన్ రెండు నెలల తర్వాత ఎడమ కాలులో నొప్పి వస్తుందంటూ మళ్లీ అదే ఆస్పత్రికి వచ్చాడు. ఎడమకాలి రక్త నాళాల్లో కొన్ని చోట్ల రక్తం గడ్డకట్టుకపోవటాన్ని గమనించి వైద్యలు మరో మూడు నెలలు అతనికి సేవలందించి కోలుకున్నాక డిశ్చార్జ్ చేశాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. తానింకా పూర్తిగా కొలుకోలేదంటూ ఆస్పత్రిలో అతగాడు తిష్ఠ వేశాడు. ఆస్పత్రి బిల్లులు చెల్లించకపోవటంతో వైద్యులు అతగానికి సేవలు కూడా నిలిపివేశాయి. అయిన కూడా అతను ఆస్పత్రి వీడలేదు. ఎంత దారుణమంటే తన కుమారుడి పెళ్లికి కూడా వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉండిపోయేంతగా. దీంతో చేసేదేమి లేక ఆస్పత్రి యాజమాన్యం కోర్టు మెట్లెక్కింది. పోనీ మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడా అని పరిక్షీస్తే దుక్కలా ఉన్నాడని తేలింది. దీంతో కోర్టు అతన్ని బయటికి పంపించేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటికి వెళ్లటం ఇష్టంలేని చెన్ ఇదిగొ ఇలా ఆస్పత్రి మంచానికి చైన్లతో బంధించుకున్నాడు. అయినప్పటికీ పోలీసులు అలాగే ఇంటికి తరలించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ