ఆ విషయంలో మనిషి, కుక్క సేమ్ టూ సేమ్

November 25, 2014 | 10:44 AM | 46 Views
ప్రింట్ కామెంట్

ధ్వనులను విశ్లేషించడంలోనండీ. పరిసరాల్లోని శబ్ధాలకు శునకాలు ఎలా స్పందిస్తున్నాయి, వాటి మెదళ్లలో ఏయే శబ్ధాలకు ఎలాంటి స్పందనలు కలుగుతున్నాయనే అంశాలపై హంగేరి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇందుకోసం తొలుత 11 కుక్కలకు శిక్షణ ఇచ్చిన తర్వాత వాటి మెదళ్లను ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసేటప్పుడు వాటికి కుక్కల, మనుషుల అరుపుల శబ్ధాలను వినిపించారు. తర్వాత ఏయే శబ్ధాలకు ఎలాంటి స్పందనలు కలిగాయో పరిశీలించారు. శునకాల్లో కూడా మనుషుల్లో మాదిరిగానే మెదడులోని ‘ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్’ అనే భాగం స్పందిస్తోందని గుర్తించారు. అయితే మనుషులు తోటి మనుషుల శబ్దాలకు ఎక్కువగా స్పందిస్తుండగా, కుక్కలు కూడా కుక్కల శబ్దాలకే ఎక్కువగా స్పందిస్తున్నాయట. శబ్ధాలను విశ్లేషించి, స్పందించే గుణం ఒకే తీరులో ఉండటం వల్లే శునకాలు మనుషులకు నేస్తాలుగా మారి ఉండొచ్చునని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై లోతైన విశ్లేషణ చేస్తేనే గానీ మరిన్నీ విషయాలు రాబట్టలేం అని అంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ