స్మార్ట్ ఫోన్ల కోసం మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్ యాప్

January 30, 2015 | 02:28 PM | 34 Views
ప్రింట్ కామెంట్

సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ ను ప్రవేశపెట్టింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అవుట్ లుక్ యాప్ ను తీసుకొచ్చింది. అకాంప్లీ పేరిట ఇంతకు ముందు ఉన్న ఈమెయిల్ స్టార్టప్ స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నారు. అవుట్ లుక్ సర్వీస్ ఆఫీస్ 365, ఎక్స్చేంజ్, అవుట్ లుక్.కామ్, యాహు మెయిల్, జీమెయిల్, ఐక్లౌడ్, ఇతర ఈ మెయిల్ సర్వీసులను ఇది సఫోర్టు చేస్తుంది. ఈ కొత్త యాప్ ద్వారా షెడ్యూలింగ్ కు వీలుంటుందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ఈ యాప్ సాయంతో యూజర్ల డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్, మైకోసాఫ్ట్ వన్ డ్రైవ్ నుంచి ఫైళ్లను అటాచ్ చేసుకోవచ్చు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ