పాక్ లో ఉగ్రపంజా... 100 మంది విద్యార్థులు మృతి

December 16, 2014 | 04:04 PM | 48 Views
ప్రింట్ కామెంట్

పాకిస్థాన్ లోని పెషావర్ లో ఉన్న ఆర్మీ పాఠశాలపై దాడి చేసిన పాక్ తాలిబాన్లు నరమేధం సృష్టిస్తున్నారు. చిన్నారులనే జాలి, కరుణ కూడా లేకుండా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ… పిల్లలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేస్తున్నారు. ఇప్పటిదాకా 100 మందికి పైగా విద్యార్థులను హతం చేశారని పాకిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 400 మంది వరకు ఉగ్రవాదుల చెరలో ఉన్నారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రకటించింది. వీరిలో ముగ్గురు ముష్కరులను పాక్ సైన్యం కాల్చి చంపింది. విద్యాలయంపై ఉగ్రదాడిని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు, పాక్ సైనికులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాడిపై భారత్ ప్రధాని మోడీతో సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ