వాకింగ్ తో బ్యాటరీ ఛార్జింగ్

November 27, 2014 | 05:41 PM | 57 Views
ప్రింట్ కామెంట్

మొబైల్ ఫోన్లను చార్జ్ చేయడానికి శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో మనిషి కదలికలతో బ్యాటరీ చార్జ్ అయ్యే విధానాన్ని అభివృద్ధి చేశారు మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు. రెండు సెంటిమీటర్ల వెడల్పున్న ఈ బ్యాటరీని జేబులో పెట్టుకుని సరదాగా పార్కులో వాకింగ్ చేస్తే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు సరిపడా శక్తిని అందిస్తుందట. థర్మల్ రీజనరేటివ్ ఎలక్ట్రోకెమికల్ సైకిల్ సిద్ధాంతం ఆధారంగా ఈ బ్యాటరీ పనిచేస్తుందని మసాచుసెట్స్ పరిశోధకులు తెలిపారు. ఈ బ్యాటరీ శరీర ఉష్ణాన్ని గ్రహించి, దాన్ని విద్యుత్ శక్తిగా మార్చివేస్తుంది. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ