ఒక్కరోజు ‘బ్రా’ కు సెలవిస్తే ఫలితమేంటి?

October 16, 2015 | 12:06 PM | 3 Views
ప్రింట్ కామెంట్
no-bra-day-in-india-breast-cancer-awareness-niharonline

ఆడవాళ్ల అందాలను దాచిపెట్టే అంగవస్త్రంలా కాకుండా బ్రా అనేది ఇప్పుడొక ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారింది. లెక్కలేనన్ని మోడల్స్‌ లభ్యమవుతున్నాయి. అయితే 'బ్రా'ల్లో. ఏది వాడాలో? ఏది వాడకూడదో తెలియక అనేక అనర్ధాలు కొనితెచ్చుకుంటున్నారు నేటితరం యువతులు. బ్రెస్ట్ కాన్సర్ అవేర్ నెస్ నెలగా అక్టోబర్ స్థిర పడిపోయింది. అంతేకాదు అక్టోబర్ 13న నో బ్రా డే గా సెలబ్రేట్ చెయ్యాలని నిర్వాహకులు సూచించటంతో పాశ్చాత్యదేశాల్లో దీనిని పాటించారు కూడా. అయితే నేటి తరం యువతలో ఆరోగ్యపరమైన సమస్యల ను ఎవరూ కొని తెచ్చుకోవట్లేదు. అసలు అవన్నీ ఎందుకు బ్రా వేసుకోవడం మానేస్తే? అనే ఆలోచనతో అదొక ఉద్యమంలా కూడా మారింది.

అతి సర్వత్ర వర్జయేత్‌ అంటే మేకప్‌ ఎంతవరకు అవసరమో అంతే పూసుకోవాలి. అదే వస్త్రాలంకరణలో కూడా పాటిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. బిగుతుగా తమ స్తనాల్ని 'బ్రా'ల్లో బంధించడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇది కాన్సర్ కు దారితీయోచ్చని చెబుతున్నారు. అయితే ఒక్కొసారి సరైన బ్రా ధరించినా, అది కూడా ఎంతో కొంత సమస్య తెచ్చిపెట్టకుండా ఉండదట. దీంతో వారంలో ఒక రోజు పూర్తిగా బ్రా వేసుకోవడం మానేయాలని వారు సూచిస్తారు.

అవసరానికి తగ్గట్టుగా రోజులో కొంత భాగం 'బ్రా'ని ఉపయోగించినా, నిద్రపోయే సమయంలోనూ, ఇంట్లో ఖాళీగా ఉండే సమయాల్లోనూ బ్రాకి సెలవిచ్చి, వక్షద్వయానికి స్వేచ్ఛనివ్వడం మంచిదట. మనదేశంలో ఇలాంటివి వినటానికి కాస్త ఎబ్బెట్టుగా అనిపించటం కామన్. అయితే విమర్శలు వచ్చినప్పటికీ ఆరోగ్యం కోసం ఇలాంటి పద్ధతులను పాటించటంలో తప్పేంలేదని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ