ఈ కండోమ్ ఛాలెంజ్ ఏంట్రా నాయనా?

December 10, 2015 | 11:09 AM | 1 Views
ప్రింట్ కామెంట్
condom_challenge_viral_in_social_media_niharonline

కండోమ్ ఛాలెంజ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోలు ఇవే. సరదా కోసం ఇద్దరు జపనీస్ యువకులు చేసిన ఈ వీడియో ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఛాలెంజ్ గా స్వీకరించి చేస్తున్నారు. ఐస్ బకెట్ ఛాలెంజ్ అయితే ఎలా పాపులర్ అయ్యిందో ఇప్పుడు ఈ కండోమ్ చాలెంజ్ కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతుంది.

                                వినడానికి వికృతంగా ఉన్నప్పటికీ సేఫ్ సెక్స్ ను ప్రమోట్ చేయటానికి ఈ ఇద్దరు యువకులు సరదాగా మొదలుపెట్టిన ఈ చర్యకు మంచి ఆదరణే దక్కుతుంది. ఇక ఈ ఛాలెంజ్ విషయానికొస్తే ఇందులో ఒక యువకుడు బాత్ టబ్ లో కూర్చుని ఉంటాడు. ఇంకో వ్యక్తి కండోమ్ ను తీసుకొచ్చి బాత్ టబ్ లో కూర్చన్న వ్యక్తి నెత్తిన కండోమ్ ను తొడిగి దానిని నీటితో నింపుతాడు. ఇలా కండోమ్ పేలిపోయే వరకు దానిని నింపుతూనే ఉంటాడు. కండోమ్ లోపల ఉన్న వ్యక్తి అది పేలిపోయే వరకు తలను కదిలించకూడదు. ఒకవేళ కదిలిస్తే ఓడిపోయినట్లే. ఒకవేళ ఎంత నీరు నింపినా అది పేలకపోతే లోపల ఉన్న మనిషి ఊపిరి ఆడకుండా చనిపోతాడు కదా అనుకుంటున్నారు. బయట ఉన్న వ్యక్తి దాన్ని పేల్చి అవతల వ్యక్తిని కాపాడతాడన్న మాట.

నవంబర్ రెండో వారంలో ఆ యువకులు వీడియోను అప్ లోడ్ చేయగా సుమారు లక్షన్నర మంది ఈ కండోమ్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు మరి. అయితే సరదాగా చేస్తున్న ఈ ప్రయత్నంలో  అపశృతులు కూడా దొర్లుతున్నాయి. ఇప్పటిదాకా 14 మంది ప్రాణాలు కోల్పోయారు కూడా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ