మాజీ సీఎం ట్విట్టర్లో ఫైర్ యాక్సిడెంట్

January 01, 2016 | 11:36 AM | 1 Views
ప్రింట్ కామెంట్
omar-abdullah-twitter-fire-accident-posted-niharonline

దుబాయి పేరు చెబితే చాలు ఎటుచూసినా ఆకాశహర్మ్యాలు, షాపింగ్ మాల్ లు గజిబిజిగా ఉంటంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతిగా రికార్డులకెక్కిన బుర్జ్ ఖలీఫా కూడా ఇక్కడే ఉంది.  అయితే ఎత్తైన భవనాలే కాదు తరచు వాటికి జరిగే ప్రమాదాలు కూడా అక్కడ జనాల్ని తీవ్ర కలవరపాటుకి గురిచేస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలు మరికాసేపట్లో ప్రారంభమవుతాయనగా బుర్జ్ ఖలీపాకు కూతవేటు దూరంలోని ‘ద అడ్రెస్ ఇన్ దుబాయ్’ హోటల్ లో మంటలు చెలరేగాయి. 63 అంతస్తులతో ఉన్న ఈ భవంతిలో కిందిభాగంలో ఎగసిన మంటలు క్షణాల్లో భవనం పై భాగానికి విస్తరించాయి.

                                  న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వారితో పాటు హోటల్ లోని వ్యక్తులు ప్రమాదం సంభవించిన వెంటనే పరుగు పరుగున బయటకు వచ్చేశారు. ఈ ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అక్కడికి సమీపంలోనే ఉన్నారు. ప్రమాదం సంభవించిన హోటల్ కు సమీపంలోని మరో హోటల్ లో బస చేసిన అబ్దుల్లా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తన సెల్ ఫోన్ తో రికార్డు చేసి, ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన తీరుపైనా ఆయన కామెంట్లు పోస్ట్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ