భారత్ తో చర్చలపై పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. అన్ని అంశాలపైనా పాక్ అర్థవంతమైన చర్చలను కోరుకుంటోందని స్పష్టం చేశారు. నేపాల్ లో జరిగిన సార్క్ దేశాల సదస్సు సందర్భంగా, మోదీ, షరీఫ్ మధ్య చర్చలు ఉంటాయని అందరూ భావించారు. అయితే, పాక్ ముందుకు రాకపోవడంతో చర్చలు సాధ్యపడలేదు. నేపాల్ నుంచి పాక్ తిరిగివెళుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ సమస్య సహా అన్ని అంశాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఎవరైనా పాక్ గౌరవప్రతిష్ఠలను మంటగలిపేందుకు యత్నించడాన్ని అంగీకరించబోనని హెచ్చరించారు.