కొసావోకు ఆదర్శం మనోళ్లేనా?

November 18, 2015 | 12:05 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Kosovo_Parliament_pepper_spray_tear_gas_attack_niharonline

సభలో మైకులు విరిచేయటం, కుర్చీలు విసురుకోవటం, పేపర్లు చెల్లాచెదురు చేయటం  విసురుకోవటం గత వైభోగం. కానీ ఇఫ్పుడు ట్రెండ్ మారింది. కాలంతోపాటు విధానాలు మారుతున్నాయి లేండి. పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే ఎటాక్ ఎక్కడో విన్నట్లుంది కదా. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు సమయంలో లగడపాటి పుణ్యమాని ప్రపంచానికి బాగా పరిచయం అయిన పేరు. పార్లమెంట్ తలుపులు మూసి ఉన్నప్పటికీ జరిగిన ఈ దాడి ఎల్లలు దాటి బయటికి వచ్చి మొత్తం లోకానికి తెలిసిపోయింది. బహుశా దీనిని ఇన్సిపిరేషన్ గా తీసుకున్నారేమో మరోచోట కూడా ఇలాంటి ఘటనే రిపీట్ అయ్యింది.

కొసావో దేశ పార్లమెంట్ సమావేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికారపక్షం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షం సమావేశాలను అడుగడుగునా అడ్డుకుంటుంది. సెర్బ్ కమ్యూనిటీలకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం. అదేవిధంగా మాంటీనిగ్రోతో చేసుకున్న సరిహద్దు ఒప్పందాలను రద్దు చెయ్యాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది.

                              గడిచిన రెండు నెలలుగా పార్లమెంట్ సమావేశాల పనితీరు ఈ విధంగానే నడుస్తోంది. ఈ క్రమంలో భాగంగా తలపెట్టిన నిరసనలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు పార్లమెంట్‌లో టియర్ గ్యాస్‌ను, పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ప్రతిపక్ష నేత అల్‌బిన్ కుర్తి మంత్రులపై పెప్పర్ స్ప్రేను చల్లాడు. పార్లమెంట్ ప్రధాన హాలును బలవంతంగా ఖాళీ చేయించాడు. పార్లమెంట్ వెలుపల పహారా కాస్తున్న పోలీసు సిబ్బంది సైతం తమపై జరుగుతున్న రాళ్లదాడిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించింది. యూరోప్‌లోని కొసావో 2008లో సెర్బియా నుంచి విడిపోయి స్వాతంత్య్రం పొందింది. కాగా కొసావో సార్వభౌమత్వాన్ని సెర్బియా అంగీకరించటం లేదు. దీంతో అక్కడ అతలా కుతలం జరుగుతోంది. బహుశా కోసావో భారత్ పార్లమెంట్ ఫుటేజ్ వీడియోలు చూసిందేమోనని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ