ప్రస్తుత కాలంలో ప్రేమ మైకంలో యువతీయువకులు ఎంతటి ఘాతుకాలకైనా ఒడిగడుతున్నారు. తాజాగా, ఓ యువతి కన్నతల్లినే హత్య చేసిన ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. ఆ యువతి ప్రేమ వ్యవహారానికి తల్లి అడ్డుచెప్పటమే పాపమైంది. ముబారక్ పూర్ గ్రామానికి చెందిన సోనియా (22) అనే యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉంది. అయితే ఆమె ప్రేమకు తల్లి శకుంతల(50) అభ్యంతరం చెప్పింది. దీంతో సోనియా ప్రియుడు కుల్విందర్ తో కలిసి తల్లిని సజీవ దహనం చేసింది. సగం కాలిన తల్లి మృతదేహాన్ని ప్రియుడి సాయంతో ఇంటి ఆవరణలో పూడ్చివేసింది. ఆ సమయంలో ఆ యువతి సోదరులిద్దరూ ఇంట్లో లేరు. తిరగొచ్చాక వారు తల్లి గురించి అడగ్గా... ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని ఎవరితోనో లేచిపోయిందని చెప్పిందా దుర్మార్గురాలు. అనుమానం వచ్చిన సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం బయటపడింది. శకుంతల మృతదేహాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించిన పోలీసులు ఆ ప్రేమపక్షులను అరెస్ట్ చేసి చెరసాలలో బంధించింది.