సౌదీ రాజు సొంత కొడుక్కే షాకిచ్చాడు

April 29, 2015 | 01:26 PM | 42 Views
ప్రింట్ కామెంట్
bin_Abdul_Aziz_Al_announce_new_king_niharonline

సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. దీంతో అతని స్థానంలో రాజుగా బాధ్యతలు చేపట్టారు సవతి సోదరుడు సల్మాన్ బిన్ అబ్దుల్. అయితే అయిన తీసుకున్న తాజా నిర్ణయం షాక్ కి గురిచేసేలా ఉంది. తన కుమారుడైన మహ్మద్ బిన్ సల్మాన్ ను రాజుగా ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో... అబ్దుల్ అజీజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న మొహమ్మద్ బిన్ నయీఫ్ ను రాజుగా ప్రకటించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు తన కుమారుడు సల్మాన్ నయీఫ్ డిప్యూటీగా ప్రకటించాడు. వీరి పరిపాలనలో రాజ్యం ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక సౌదీకి రాజుగా ఎలాలన్న ఆశలతో ఉన్న సల్మాన్ తన తండ్రి నిర్ణయంతో షాక్ కి గురయ్యాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ