మద్యం మత్తులో సెల్ఫీ తీసుకోబోయి... చచ్చింది

July 09, 2015 | 04:52 PM | 1 Views
ప్రింట్ కామెంట్
russian_teen_died_selfie_kills_niharonline

సెల్ఫీల పిచ్చి ప్రాణాలకు ముప్పు తెస్తున్న ఘటనలు ఈ మధ్య మనం చూస్తేనే ఉన్నాం. వయస్సుతో సంబంధం లేకుండా జనాలందరిలోకి పాకిన ఈ అలవాటుకి ఎందరో బలి అవుతున్నారు. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో సాహసాలు చేస్తూ కొందరు ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు ప్రమాదవశాత్తూ చనిపోతున్నారు. తాజాగా, రష్యాలో ఓ సంఘటనలో 21 ఏళ్ల యువతి ప్రమాదవ శాత్తూ ప్రాణాలు కోల్పోయింది. అన్నా కృపేనికోవా అనే ఓ యువతి బ్రిడ్జిపై నిలుచుని సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. లోయ 40 అడుగుల లోతు ఉండటంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. టూరిజం గ్రాడ్యూయేట్ అయిన ఆమె తన స్నేహితురాలి బర్తే డే వేడుకల కోసం విహార యాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడి ప్రకృతి దృశ్యాలు వీక్షించేందుకు బ్రిడ్జిపై బస్సు ఆపి ఫోటోలు దిగుతున్నారు. ఆ సమయంలో అన్నా మద్యం ఏమన్నా సేవించిందని పోలీసులు చెబుతున్నారు. అయితే తమలో ఎవరూ మద్యం సేవించలేదని మిత్రులు చెప్పటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ