పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. అతని నిర్వాకానికి భయపడ్డ ఇంగ్లాండ్ ప్రభుత్వం బాబ్బాబు ఎంతమందితోనైనా తిరుగు అభ్యంతరం లేదు. పిల్లల్ని మాత్రం కనకు అంటూ బతిమాలుకుంటున్నారట. మాన్ మౌత్ ఫైర్ లో నివసిస్తున్న మైక్ హాల్పిన్ (53) ఓ చిరుద్యోగి. ప్రియురాలితో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. తర్వాత మరో ప్రియురాలితో మరో ఇద్దరిని కన్నాడు. వారి పోషణకు భత్యం సరిపోకపోవటంతో బ్రిటన్ ప్రభుత్వం భత్యం చెల్లించటం మొదలుపెట్టింది. దీంతో పనిచేయటం మానేసి 20 మంది ప్రియురాళ్లతో 40 మంది పిల్లల్ని కన్నాడు. వీరి పోషణార్థం బ్రిటన్ ప్రభుత్వం ఏడాదికి 25 లక్షల రూపాయలు చెల్లిస్తోందట. 20 మంది పిల్లల్ని సామాజిక సేవా సంస్థలు దత్తత తీసుకుని పోషిస్తున్నాయట. ఈ 40 మంది పిల్లల్లో చాలా మంది పేర్లు కూడా అతనికి గుర్తులేవట. ఎవరైనా తన ముందుగా వెళ్లిపోతుంటే వారి మీద డౌటొస్తే వారి వీపు చూస్తాడట. వారి వీపుమీద తన వంశం వ్రుక్షం పచ్చబొట్టు పొడిపించాడట. ప్రస్తుతం ఇతను ప్రభుత్వ హాస్టల్లో ఫియాన్సీ డయానా మోరిస్ తో కలిసి ఉంటున్నాడు. ప్రియరాళ్లతో సెక్స్ లో పాల్గొనటం, పిల్లల్ని కనటం ఆపనని బైబిల్ సూక్తులను కూడా గుర్తుచేస్తున్నాడు.