ప్రెసిడెంట్ భవనంలో పుర్రెలు, ఎముకలు!!!

October 07, 2015 | 10:32 AM | 6 Views
ప్రింట్ కామెంట్
skelton-skulls-found-in-afganisthan-president-building-niharonline

ఆషామాషీ భవనం కాదది. 24 గంటలు భారీ బందోబస్తుతో చీమ చిట్టుకుమన్నా అలర్ట్ అయ్యే సెక్యూరిటీతో ఎప్పుడూ హడావుడిగా ఉండే అధ్యక్ష భవనం అది. అయితే భద్రతా సిబ్బంది గస్తీ కాసే ఆ బిల్డింగ్ లో అస్థిపంజరాలు లభ్యమవ్వటం షాక్ కి గురిచేసింది. విస్మయానికి గురి చేసిన ఈ ఘటన అప్ఘనిస్థాన్ అధ్యక్ష భవనంలో చోటుచేసుకుంది.

అధ్యక్ష భవనంలోని కాంపౌండ్ లో ఉన్న కిచెన్ లో కార్మికులు నిర్మాణ పనులు చేస్తుండగా ఈ విషయం వెలుగు చూసింది. రూమ్ బేస్ మెంట్ కదిలిస్తుండగా పనివారికి ఏదో సౌండ్ వచ్చిందట. తీరా వారికి అక్కడో బాక్స్ లభ్యమయిందట. ఓపెన్ చేసి చూస్తే అందులో మానవ పుర్రెలు, ఎముకలు లభ్యమయ్యాయి. దీంతో భీతిల్లిన వారు విషయాన్ని అధ్యక్షభవన సిబ్బందికి తెలియజేశారు. 2 మానవ పుర్రెలతో పాటు, ఎముకలు కూడా లభ్యమైనట్టు అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి ధృవీకరించారు. అయితే అవి ఎవరివనే విషయం ఇప్పటికిప్పుడే చెప్పడం కష్టమని అధికారులు చెప్పారు. కాగా, ఈ ఘటనపై ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఘని దర్యాప్తునకు ఆదేశించారు. అయితే ఇంతకు ముందు ఈ ప్రదేశంలో స్మశానం ఉండేదని పలువురు చెబుతున్నారు. నిజం అదేనా లేదా మరేదైనా మర్మం దీని వెనుకదాగుందా విచారణ తర్వాతే తేలనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ