జంబలకిడి పంబ: అక్కడ పురుషులపై రేప్ లు కామన్

May 09, 2015 | 12:00 PM | 41 Views
ప్రింట్ కామెంట్
woman_raped_man_in_south_africa_niharonline

బ్రహ్మాంగారు చెప్పినట్టు కలికాలంలో పోయే కాలం దాపురించింది. ఇన్నాళ్లు మహిళలపై లైంగికదాడులు జరగడం విన్నాం. కానీ , ఈ మధ్య  దక్షిణాఫ్రికాలో పురుషులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య ముగ్గురు యువతులు ఓ యువకుడిని బెదిరించి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. గాటెంగ్ నగరంలో మహిళలు తుపాకీతో బెదిరించి 33 ఏళ్ల యువకుడిని బీఎండబ్ల్యూ కారులో తీసుకెళ్లారు. ఆ యువకుడిని 500 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లారు. నిర్మానుష ప్రాంతంలో కారును ఆపి అతని చేత బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ముగ్గురు యువతులు అతనిపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం అతడిని కారులోంచి తోసేసి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు గాటెంగ్ నగరంలో గత రెండు నెలల్లో  ఇలాంటి ఘటనలు 37 చోటుచేసుకున్నాయని పోలీసులు తెలుపుతున్నారు. మహిళలు, యువతులు ఎక్కువగా డ్రగ్స్ కు అలవాటుపడటంతో తరచూ మగాళ్లపై ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తెలుస్తొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ