మోనాలిసా ఆయన తల్లా?

December 05, 2014 | 02:54 PM | 66 Views
ప్రింట్ కామెంట్

మోనాలిసా.... ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన ప్రముఖ చిత్రం. ఇప్పుడు ఈ పెయింటింగ్ గురించి ఓ సంచలన వార్త బయటికి వచ్చింది. అదేంటంటే ఆ మోనాలిసా ఎవరో కాదు స్వయానా లియోనార్డో తల్లేనట. అంతేకాదు ఆమె చైనా నుంచి వచ్చిన బానిస అని ఇటలీ కి చెందిన ప్రముఖ చరిత్రకారుడు యాంజిలో పరాటికో చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె వెనుక చైనాకు చెందిన ప్రకృతి దృశ్యం ఉందని, ఆమె ముఖంలో చైనీయుల పోలికలున్నాయని వివరించారు. లియోనార్డో తండ్రి క్లయింట్లలో ఒకరి దగ్గర క్యాథెరినా అనే మహిళా బానిస ఉండేదని, 1452లో లియోనార్డో పుట్టిన తరువాత ఆమె కనిపించలేదని యాంజిలో తెలిపారు. కాగా, ఈ ఇంటర్వ్యూ ప్రచురితమయ్యాక 40 లక్షల మంది చదవగా, 1.6 లక్షలకు పైగా పోస్టింగ్స్ వచ్చాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ