ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది ఖాతాదారులతో మొబైల్ చాటింగ్, షేరింగ్ సేవలందిస్తున్న సోషల్ నెట్ వర్కింగ్ యాప్ వాట్స్ యాప్. ఇప్పటి దాకా మొబైల్ కే అంకితమైన ఈ యాప్ కు సంబంధించి ఇప్పడు డెస్క్ టాప్ వర్షన్ కూడా విడుదల చేసింది. కోట్ల మంది వాట్స్ యాప్ వినియోగదారుల కోరిక మేరకు దీన్ని అభివ్రుద్ధి చేసినట్లు తెలిపింది. కొత్త సేవలకు ‘వాట్స్ యాప్ వెబ్’ అని పేరు పెట్టింది. ఇదీ గూగుల్ క్రోమ్ లో మాత్రమే పని చేస్తుంది. కంప్యూటర్ పై వాట్స్ యాప్ ను వాడుకోవాలంటే మొబైల్ లో ఉన్న వాట్స్ యాప్ నుంచి https://web.whatsapp.com/ వెబ్ సైట్ లో కనిపించే కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ పై వాట్స్ యాప్ వాడుకున్నా ఈ సమాచారం ఎప్పటికప్పుడు మొబైల్ లో స్టోర్ అవుతుందని సంస్థ పేర్కొంది. ఇదీ పనిచేయాలంటే మాత్రం వాట్స్ యాప్ లేటేస్ట్ వర్షన్ మీ మొబైల్ లో ఉండాల్సిందే.