ఆటాడుతూనే క్షణంలో మృత్యు ఒడిలోకి

March 03, 2015 | 12:44 PM | 62 Views
ప్రింట్ కామెంట్
zeebra_hepopotamas_niharonline

ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం ఓ పిల్ల కంచర గాడిద, ఓ ఖడ్గమృగం చూడ్డానికి ఖడ్గమృగం ఆ పిల్లను పొడిచి చంపేసిందేమో అనుకుంటాం. కానీ జరిగిందివేరు. ఆ బుజ్జి కంచరగాడిద పాపం ఆనందంతో గెంతులేస్తూ వీక్షకులనూ ఆనందంలో ముంచేసిందట. అలా ఆడుతూ ఆడుతూ ఓ బురదగుంటలో పడిపోయిందా పిల్ల గాడిద. అక్కడికి వచ్చిన జనం చూస్తుండగానే ఆ బురదలో కూరుకుపోతుండగా దాన్ని కాపాడాలని అక్కడున్న ఖడ్గమృగం తన కొమ్ముతో పక్కకు జరపపోయింది. ఇంతలో ఆ కొమ్ము కాస్తా ఆ పిల్ల పొట్టలో దిగిపోయింది. అందరూ చూస్తూ ఉండగానే గట్టిగా అరుస్తూ ప్రాణాలు విడిచింది పాపం ఆ గాడిద పిల్ల. ఇంతకూ ఇది ఎక్క డ జరిగిందనుకుంటున్నారు? సౌతాఫ్రికాలోని మెడిక్వే జంతుప్రదర్శనశాలలోనిదీ దృశ్యం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ