మణిపూర్ లో సోమవారం భారీ భూప్రకంపనలు సంభవించాయి. తెల్లవారు ఝామున 4.30కి మొదటి ప్రకపంనలు రాగా, కాసేపటికే రెండోసారికి భారీగానే భూకంపం సంభవించింది. ఇక మణిపూర్ భూకంపంపై ప్రస్తుతం కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ఎన్ డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్, సమాచార శాఖల సమన్వయంపై సమీక్షించారు. రక్షణ మంత్రిత్వ, ఇతర ముఖ్య శాఖలతో కూడా కేంద్ర కేబినెట్ సమీక్ష జరిపింది. భూకంప తీవ్రతకు ఇప్పటివరకు ఆరుగురు చనిపోగా, 43 మందికి గాయాలైనట్టు గుర్తించారు. పలు భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నట్టు అధికారుల అంచనా వేశారు. ఇంపాల్ లో ఆరంతస్తుల భవనం ఒకటి పూర్తిగా కూలిందని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గౌహతి నుంచి ఇంపాల్ కు 45 మంది చొప్పున రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలిస్తున్నామని చెప్పింది. సహాయ పునరావాస కార్యక్రమంపై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సమాచార వ్యవస్థపై బీఎస్ఎన్ఎల్ అధికారులు దృష్టి సారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.