హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిషేధాజ్నలు ఎదుర్కొంది మ్యాగీ నూడుల్స్. ఎప్పుడైతే దానిపై వదంతులు వ్యాపించాయో అయినా సరే తమ ఫేవరెట్ ను మానుకోలేమంటూ చాలా మంది మ్యాగీ కోసం ఎగబడ్డారు. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో మ్యాగీ పై నిషేధం అమలయింది. దీంతో డీలాపడ్డారు చాలా మంది మ్యాగీ ప్రియులు. అయితే నాణ్యతా ప్రమాణాల పరీక్షల్లో విజయం సాధించి తిరిగి మార్కెట్లోకి వచ్చేసింది మ్యాగీ. అయితే రీఎంట్రీ లో మ్యాగీకి ఎంత గ్రాండ్ వెల్ కమ్ లభించిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక మానరు.
మూడు రోజుల క్రితం మార్కెట్లోకి వచ్చిన మ్యాగీ అమ్మకాలు ఎలా సాగుతాయోనని అంతా అనుకున్నారు. అయితే అమ్మకాల జోరును చూసి నెస్లే సంస్థ కూడా ఇప్పుడు షాక్ తింటుందట. స్నాప్ డీల్ లో ఒక్క గురువారం ఉదయమే మ్యాగీకి చెందిన 60 వేల వెల్ కమ్ కిట్లను కేవలం 5 నిమిషాల్లోనే అమ్ముడుపోయి సత్తా చాటింది. కస్టమర్లకు మ్యాగీపై ఆపేక్షను ఈ ఫ్లాష్ సేల్ లో చూపించారని స్నాప్ డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోనీ నావిన్ చెబుతున్నారు. సరాసరిన సెకనుకు 200 కిట్లు అమ్ముడయ్యాయని వివరించారు. ఈ కిట్ లో 12 రకాల మ్యాగీ ప్యాకెట్లు, 2016 క్యాలెండర్, మ్యాగీ ఫ్రిజ్ మాగ్నెట్, పోస్టు కార్డులను ఉంచినట్టు ఆయన తెలిపారు. కాగా, నవంబర్ 9 నుంచి దేశవ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలు తిరిగి ప్రారంభం కాగా, విపరీతమైన క్రేజ్ తో తిరిగి అమ్ముడపోతున్నాయి. బస్ దో మినిట్ కదా మీరు ఎగబడిపోండి మరి.