లీటర్ పెట్రోల్ అసలు ధర ఎంతో తెల్సా?

November 10, 2015 | 05:54 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Taxes exceed actual cost of petrol  Rs 31 in retail price

నెలకొకసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంచుతూ అందులో తమ ప్రమేయం ఏదీ లేదని కేంద్రప్రభుత్వం స్టేట్ మెంట్లు ఇస్తూ ఉంటుంది. పెట్రోలియం కంపెనీలే ఈ ధరలను నిర్ణయిస్తాయని, వాటికి అనుగుణంగానే ధరలు పెంచుతున్నామని నంగనాచి కబుర్లు చెప్పడం వారికి మాములే. కానీ, ఆ కష్టాలు తెలిసేది మాత్రం వాహనదారులకే. అయితే ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరల అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల వల్ల కనిష్ఠ స్థితికి చేరుకున్నాయి. భారత్ లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. వాస్తవ పరిస్థితిని గమనిస్తే షాక్ అవ్వటం వాహనదారుల వంతు అవుతుంది.

వాస్తవానికి పెట్రోలు లీటర్ ఉత్పత్తి చేసేందుకు అయ్యే ధర కేవలం రూ. 24.75 పైసలు. రవాణా ఖర్చులు, ఉద్యోగుల నిర్వహణ, లాభాలను కలుపుకుని అంతర్జాతీయంగా లీటర్ పెట్రోలు ధర రూ. 27.74 పైసలు. దీనిపై డీలర్ కమీషన్ రూ. 2.26 పైసలు అంటే లీటర్ పెట్రోలు 30 రూపాయలు అవుతుంది. దీనిపై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం రూ.19.06 పైసలు, వ్యాట్, రాష్ట్రం విధించే సుంకం రూ. 12.14 పైసలు. ఇవన్నీ కలుపుకుని వినియోగదారుడి దగ్గరకు వచ్చే సరికి లీటర్ పెట్రోలు ధర రూ. 61.20 పైసలు అవుతుంది. మిగిలిన 80 పైసలు ఎలాగూ పెట్రోలు బంకుల యాజమాన్యాలు మెక్కేస్తాయి. ఈ లెక్కన లీటర్ పెట్రోలు 62 రూపాయలు అయింది.

పెట్రోలియం కంపెనీల యాజమాన్యాలు ధరలను తగ్గించినా కేంద్రం, రాష్ట్రాలు పన్నులను మాత్రం సమీక్షించవు. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోలు ధరలు ఎంత దిగువకు చేరుకున్నా భారతదేశంలో మాత్రం కిందికి దిగిరావు. ప్రభుత్వాలు మాత్రం వాహనదారుల ఉసురును మాత్రం పోసుకుంటాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ