యూపీలో దారుణం: పిల్లాడిని కొట్టి చంపిన ప్రిన్సిపాల్

April 09, 2015 | 01:55 PM | 69 Views
ప్రింట్ కామెంట్
eight_year_kid_beaten_by_principle_killed_niharonline

పెన్సిల్, ఎరేజర్ దొంగిలించాడని ఓ ఎనిమిదేళ్ల బాలుడిని పాఠశాల ప్రిన్సిపాల్ పొట్టనబెట్టుకున్నాడు. నిర్దయగా చావగొట్టడంతో ఆ పిల్లాడు రక్తం కక్కుకుని మరీ చనిపోయాడు. ఘోరమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రైలమావ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బారాబంకీలోని ద్వారకా ప్రసాద్ స్కూల్ లో ఇద్దరు విద్యార్థులు కొత్తగా చేరారు. ఒక విద్యార్థి తన పెన్సిల్, ఎరేజర్ కనిపించలేదని ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన ప్రిన్సిపాల్ విద్యార్థుల బ్యాగులన్నింటినీ తనిఖీ చేయించాడు. కొత్తగా చేరిన మరో బాలుడి బ్యాగులో అవి దొరికాయి. దీంతో ప్రిన్సిపాల్ పిచ్చెక్కినట్లుగా బాలుడిని కొట్టాడు. ఏడుస్తూ ఇంటికి వెళ్లిన బాలుడు తొలుత కడుపునొప్పి అని చెప్పి, ఆపై రక్తం కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లిన లాభం లేకపోయింది. ఫిర్యాదు అందడంతో ప్రిన్సిపాల్ లలిత కుమార్ వర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో బారాబంకీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ