అన్నదాత సుఖీ:భవ- రూపాయికే ఫుల్ మీల్స్

August 31, 2015 | 05:28 PM | 2 Views
ప్రింట్ కామెంట్
one-rupee-full-meals-in-chennai-venkatraman-eroad-niharonline.jpg

రూపాయికి ఈ రోజుల్లో ఏం వస్తుంది. గబుక్కున చెప్పటం కొంచెం కష్టమే. కడుపు నిండా తినాలంటే కనీసం వంద రూపాయలైన జేబులో ఉండాల్సిందే. కానీ, ఓ స్ఫూర్తి దాత ఆలోచనతో కేవలం రూపాయికే కడుపు నిండా భోజనం లభిస్తుంది. అయితే అది ఈరోజు ఆలోచనేం కాదు. ఏకంగా ఎనిమిదేళ్ల నుంచి ఈరోడ్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఈ సేవలు అందిస్తున్నాడు తమిళనాడులోని వెంకటరామన్.

                ఎనిమిదేళ్ల క్రితం ఏఎంవీ అనే మెస్ ను ప్రారంభించి రూపాయికే ఐదు రకాల వంటకాలతో రుచికరమైన భోజనం పెడుతూ వస్తున్నాడు. అసలు ఆయనకు ఈ ఆలోచన వచ్చిందంటే... 2007 లో ఆయన ఓ టిఫిన్ సెంటర్ నడిపేవాడట. కేవలం 10 రూపాయలకు మూడు దోశలు అమ్ముకునేవాడట. అయితే ఓ ఆ మొత్తం కూడా వెచ్చించే స్తోమత లేని ఓ పేద మహిళా రోగీ ఆవేదన ఆయనను కలిచివేసిందట. అంతే ఆ ఆలోచనతో... అప్పటి నుంచే ఈ రూపాయి భోజన సౌకర్యం కల్పించానని, తొలుత 10 మందికి టోకెన్లు ఇచ్చేవాడినని, ఇప్పుడు దాదాపు 70 మందికి భోజన సౌకర్యం కల్పిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. వంద పెట్టినా కడుపు నిండా తిండి లభించని ఈ రోజుల్లో కేవలం ఒక్క రూపాయికే రుచి కరమైన భోజనం అందిస్తూ వస్తున్నాడు వెంకటరామన్. ఎవరు చెప్పారండీ రూపాయి విలువ పడిపోయిందని...  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ