ప్రధాని మోదీ మ్యాజిక్ ఢిల్లీలో పని చేయదు కాబట్టే ఆప్ నేతలకు బీజేపీ గాలమేస్తుందని ఆప్ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ బీజేపీ లో చేరి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ను ఓడించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఓ మెట్టు ఎక్కి ఏకంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పైనే పోటీకి దిగుతానని ఆమె ప్రకటించింది కూడా. దీనిపై ఆప్ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆప్ నేతలే బీజేపీ కి దిక్కని, ఆ పార్టీకి ప్రజల్లో మంచివారుగా గుర్తింపున్న నాయకులు లేకనే తమవారిని ఆహ్వానిస్తున్నారని, తమ నేతలను ఎంతమందిని బీజేపీలో చేర్చుకున్నా ఢిల్లీ ప్రజలు తమ వెంటే ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామని ఆ పార్టీనేతలు వ్యాఖ్యానించారు.