తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కి ఉన్న క్రేజేంటో మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉందంట... ఎంతలా అంటే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కన్నా ఎక్కువే. జాతీయ మీడియా సంస్థ అయిన సీఎన్ఎన్ ఐబీఎన్ చానెల్ ప్రతిఏటా పాపులర్ ఛాయిస్ అవార్డు కోసం నిర్వహించే సర్వేలో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది. 2014 సంవత్సరానికిగానూ మొత్తం 6 కేటగిరీలకు 35 పేర్లను ప్రతిపాదించారు. అమీర్ తోపాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఇండియన్ ఆర్మీ మరియు నేషనల్ డిజాస్టర్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ఈ జాబితాలో ఉన్నారు. వీరందరిని తోసేసి ఈ జాబితాలో కేసీఆర్ రెండో స్థానంలో నిలుచున్నారు. ఆయన అమీర్ కన్నా 18 శాతం ఓట్లతో ముందంజంలో ఉన్నారు. ఇక మరో విషయమేమిటంటే రాజకీయ దిగ్గజాలు ఉన్న జాబితాలో మొదటి స్థానంలో కేరళకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ పీ. విజయన్ నిలిచారు. ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో ఐజీగా పనిచేశారు. కూలీ పనులు చేసి ఆయన ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యారు.