నపుంసక భర్త నరకం చూపాడట... సూసైడ్ నోట్ లో ఎయిమ్స్ వైద్యురాలు

April 20, 2015 | 11:49 AM | 121 Views
ప్రింట్ కామెంట్
priya_vedi_AIIMS_doctor_suicide_husband_gay_niharonline

ఢిల్లీలోని అత్యంత ప్రముఖ ఆస్పత్రుల్లో ఒకటైన ఎయిమ్స్ లో వైద్యుడిగా పనిచేస్తూ, బాగా పేరున్న సీనియర్ డాక్టర్ కమల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ వెనుక కారణాలు పరిశీలిస్తే దిగ్ర్భాంతి కలిగే విషయాలు వెలుగుచూస్తాయి. అతడి పైశాచికమే భార్య ప్రియ మరణానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎయిమ్స్ లో అనస్థీషియా నిపుణుడిగా పనిచేస్తున్న ప్రియకు, డెర్మటాలజిస్ట్ గా పనిచేస్తున్న కమల్ కు ఐదేళ్ల క్రితం వివాహం కాగా, దక్షిణ ఢిల్లీలోని ఎయిమ్స్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. ఇక అతగాడు పెట్టే అపరిమితమైన మానసిక హింసను తట్టుకోలేకనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి పెట్టి తన చేతి మణికట్టును కోసుకుని ప్రియ మరణించింది. పెళ్లయిన తర్వాత కమల్ నపుంసకుడని తెలిసినా సర్దుకుపోయానని, కానీ, పరిస్థితి తాను చనిపోయే వరకూ తీసుకువచ్చాడని సుదీర్ఘ లేఖ రాసింది. అంతేకాదు తన భర్తతో కలిసి శనివారం ఢిల్లీ కి వచ్చిన ఆమె సెంట్రల్ ఢిల్లీలోని ఓ హోటల్లో బస చేసి ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు కమల్ తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆమె కోసం వెతికిన పోలీసులకు ఆమె మృతదేహం కనిపించింది. తాను ‘గే’ నన్న విషయం కమల్ దాచి పెట్టాడని, కట్నం కోసం వేధించాడని ఆమె లేఖలో పేర్కొంది. అంతేకాదు ఫేస్ బుక్ లో  చనిపోయే ముందు ఓ పోస్ట్ కూడా చేసింది. ‘‘నేను నీతోనే ఉండాలని అనుకున్నాను. ఎందుకంటే నేను నిన్ను ఎంతో ప్రేమించాను. కాబట్టి నీ లోపాన్ని కూడా భరించాను. కానీ, నువ్వు నా జీవితానికి ఓ క్రిమినల్ గా మారావు. నీ కుటుంబానికి ఈ విషయాలు తెలీవు. నువ్వో దెయ్యానివి’’ అని పోస్ట్ చేసింది.     

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ