మహారాష్ట్రలో మంత్రులకు పోలీసులు ఇక సెల్యూట్ కొట్టరు. జిల్లా స్థాయి పర్యటనలో భాగంగా మంత్రులు వెళ్లినప్పుడు పోలీసులు గౌరవ వందనం సమర్పించి వారికి స్వాగతం పలుకుతారని తెలిసిన విషయమే. బ్రిటీష్ కాలం నాటి ఈ సాంప్రదాయాన్ని ఇకపై పాటించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులతోపాటు రాష్ట్ర స్థాయి అధికారులకు సైతం ఇదే నియమం వర్తిస్తుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు పాత సంప్రదాయాన్ని వదిలివేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. దీంతోపాటు వీవీఐపీలకు కల్పిస్తున్న భద్రతను కూడా తగ్గించాలని ఆయన సూచించినట్లు సమాచారం.