భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) చైర్మన్ గా కర్ణాటకకు చెందిన కిరణ్ కుమార్ నియమితులయ్యారు. అహ్మదాబాద్ స్పేస్ అఫ్లికేషన్ సెంటర్ డైరక్టర్ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ 1975 నుంచి ఇస్రోలో వివిధ హాదాలో పనిచేస్తూ వస్తున్నారు. చంద్రయాన్-1 తోపాటు మంగళయాన్ లోనూ కిరణ్ కుమార్ కీలక భూమిక పోషించారు. మొన్నటిదాకా ఇస్రో చైర్మన్ గా పనిచేసిన రాధా కృష్ణ గత నెల 31న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. రాధా కృష్ణన్ స్థానంలో తాత్కాలిక చైర్మన్ గా శైలేశ్ నాయక్ ను నియమించిన ప్రభుత్వం తాజాగా కిరణ్ కుమార్ ను రెగ్యులర్ చైర్మన్ గా నియమించింది. ఇస్రో చైర్మన్ గా కిరణ్ కుమార్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.